April 16 2023ఏప్రిల్ 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : ఏకాదశి సా. 05గం౹౹11ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారం (అదివారం)
నక్షత్రం : ధనిష్ఠ తె. 04గం౹౹53ని౹౹ వరకు తదుపరి శతభిషం 17వ తేదీ తె. 03గం౹౹17ని౹౹ వరకు  
యోగం : శుక్ల  రా. 10గం౹౹43ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  బాలవ సా. 04గం౹౹44ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 11గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹33ని౹౹ నుండి 10గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹47ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు

👉🕉️ఏకాదశి, గంగానదీ పుష్కరాలు ప్రారంభం🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము సోమవారం చెయ్యాలి.

గురుబోధ 
ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు.
నిత్యం గంగా స్మరణ చేసుకోవడం వల్ల పాపము దరిచేరదు. అంత్యకాలంలో కాశీ గంగ దగ్గర శరీరం విడిచిపెట్టే భాగ్యం కలుగుతుంది.  'గంగ' 'గంగ' అని నీళ్లను తాగేప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు స్మరించుకోవడం వల్ల గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.
ఈ శ్లోకం తప్పక నిత్యం స్మరించాలి. 
నందినీ నిళినీ సీతా మాలినీ చ మహాపగా
విఘ్ణపాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ


expand_less