April 15 2026ఏప్రిల్ 15 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి రా.8.23 కు తదుపరి చతుర్దశి 16 రా.7.08 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర మ.1.19 కు తదుపరి ఉత్తరాభాద్ర 16 మ.12.54 కు
యోగం: ఐంద్ర ఉ.10:37 కు తదుపరి వైధృతి 16 ఉ.7:21 కు
కరణం: వణిజ రా.10:31 కు తదుపరి శకుని 16 రా.8:11 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 - 12.40 కు
వర్జ్యం: రా.10.44 - 12.19 కు
అమృతకాలం: ఉ. 07.35 - 09.09 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు

🕉️ ప్రదోషం, మాసశివరాత్రి, త్రేతాయుగాది, వరాహజయంతి🕉️

గురుబోధ:
ఈ రోజు వరాహస్వామి వారిని తలచుకోవాలి. ఆయన్ని తెల్లని పూలతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి.
ప్రదోషవేళ మాసశివరాత్రిరోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను అనుగ్రహిస్తుంది.

వరాహ పురాణం👇
https://youtu.be/BItRkD8ERRQ?si=RybFXZkBCbETi64D
శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less