April 15 2025ఏప్రిల్ 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ ఉ.10.34 కు తదుపరి తదియ 16 మ.12.27 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ రా.12.50 కు తదుపరి అనూరాధ 16 రా.3.09 కు
యోగం: సిద్ధ సా.11:32 కు తదుపరి వ్యతీపాత 16 రా.12:18 కు
కరణం: గరజి ప.10.55 కు తదుపరి వణిజ రా.12.08 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:22 కు, మ. 11:06-11:52 కు
వర్జ్యం: తె.4.28-6.14 కు
అమృతకాలం: సా. 5:17 - 7:05 కు
సూర్యోదయం: ఉ. 5:51 కు
సూర్యాస్తమయం: సా. 6:11 కు

గురుబోధ:
ఎప్పుడూ భిక్ష వేసేవాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళి భిక్షుకులకి భిక్ష వెయ్యాలి. ఒకవేళ గొప్ప గొప్ప మహాత్ములు, మహాపండితులు, మహాజ్ఞానులు అదృష్టం కొద్దీ వేరే పని మీద మన ఇంటివైపు వస్తే వారిని లోపలకు ఆహ్వానించి, కాళ్ళు కడగాలి, ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాలి. వినయంగా దానం చెయ్యాలి. అంతేగాని మనము గడపలోపల ఉండి అవతలి వారు గడప బయట ఉండి ఈ మధ్యలో గడప అడ్డంగా ఉన్నప్పుడు ఇవతల నుండి అవతలకి చెయ్యి చాచి భిక్ష వేస్తే అవతలి వారి పాపాలు మనకి వస్తాయి.

expand_less