April 15 2024ఏప్రిల్ 15 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 15 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి మ. 3.51 కు తదుపరి అష్టమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పునర్వసు పూర్తి
యోగం: సుకర్మ రా. 11.09 కు తదుపరి ధృతి
కరణం: వణిజ మ. 12.11 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.41 - 01.31 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: సా. 5.44 - 7.23 కు
అమృతకాలం: తె. 3.45 - 5.25 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.32 కు

గురుబోధ:
ఉదయం 4 నుండి 5 లోపు చేసే స్నానం ఋషిస్నానం, ఉదయం 5 నుండి 6 లోపు దేవతాస్నానం, ఉదయం 6 నుండి 7 లోపు చేసే స్నానం మనుష్యస్నానం మరియు 7 తర్వాత చేసే స్నానం రాక్షసస్నానం తో సమానం. అందుకే పెద్దలు స్నానం ఉదయం 6 లోపు చేయడం మంచిది అంటారు. ఆరోగ్యం సహకరించని వారికి ఆ నియమం లేదు.

expand_less