" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 15 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : దశమి రా. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : శ్రవణం ఉ. 06గం౹౹37ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : శుభ 16వ తేదీ రా. 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : వణిజ ఉ. 08గం౹౹29ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 10గం౹౹19ని౹౹ నుండి 11గం౹౹48ని౹౹ వరకు అమృతకాలం : రా. 07గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు గురుబోధ జీవితంలో ఏ పుణ్యకార్యం, దానము చేయకపోయినా ఒక్క సద్గురువుకు గాని, పౌరాణికుడికి గాని తెలిసో తెలియకో చేసిన ఒక్క మంచి పని లేదా దానము అనంత ఫలితం ఇస్తుంది. వీలు ఉన్నప్పుడు పౌరాణికులను సేవించుకోవడం వలన ఉత్తమ జన్మలు కలుగుతాయి. ఈ ప్రపంచంలో చెడని పదార్థము అంటే దానము. విష్ణువును సేవించిన ఫలితం మనకు రావాలంటే ఎంతోకొంత దానము చెయ్యాలి.