కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 14 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి రా.9.12 కు తదుపరి త్రయోదశి 15 రా.8.23 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శతభిషం మ.1.18 కు తదుపరి పూర్వాభాద్ర 15 మ.1.19 కు
యోగం: బ్రహ్మ మ.1:24 కు తదుపరి ఐంద్ర 15 ఉ.10:37 కు
కరణం: కౌలవ మ.12:46 కు తదుపరి వణిజ 15 రా.10:31 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 - 9.23 కు, రా. 11.06 - 11.52 కు
వర్జ్యం: రా.7.42 - 9.18 కు
అమృతకాలం: ఉ. 09.04 - 10.40 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
🕉️ మేషసంక్రమణము, విషువత్పుణ్యకాలము 🕉️
గురుబోధ:
విషువత్ పుణ్య కాలం సం౹౹లో రెండు సార్లు వస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమానంగా ఉండే రోజుల్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఆ పర్వదినములలో సత్యహరిశ్చంద్ర చరిత్ర వంటి పురాణగాథలను వినడం లేదా ఏ జపం, పురాణపఠనం, శ్రవణం చేయడం, దానము, తర్పణాలు (అర్హత కలిగినవారు) ఇవ్వడం చాలా ఉత్తమం. ఏ పుణ్యకార్యం చేసినా అనంతపుణ్యం లభిస్తుందని శాస్త్రం.
https://youtu.be/y-ROsgQAYnA?si=T2LNaMR0LnXg_Pmg
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial