April 14 2025ఏప్రిల్ 14 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 14 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి ఉ.8.31 కు తదుపరి విదియ 15 ఉ.10.34 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి రా.10.17 కు తదుపరి విశాఖ 15 రా.12.50 కు
యోగం: వజ్ర సా.10:38 కు తదుపరి సిద్ధ 15 సా.11:32 కు
కరణం: కౌలవ ఉ.8.25 కు తదుపరి తైతుల రా.8.41 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12:41-1:30 కు, మ. 3:09-3:59 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.2.18-4.06 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
తల్లిదండ్రుల దయవల్ల మనకు ఈ దేహం వచ్చింది. విజ్ఞానం వచ్చింది. వారి వల్లే సంపదలు వస్తున్నాయి. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు భక్తితో గౌరవం ఇవ్వాలి. వేదములు చదివితే వచ్చే పుణ్యం, భగవంతుడికి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే పుణ్యం తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తే, వారిని పూజిస్తే వస్తుంది. తల్లిదండ్రులను పూజించడం వలన పాండిత్యం కలవారుగా, ఉన్నత స్థానాలను పొందేవారిగా తయారవుతారు. ఒకవేళ పూజించకపోయినా కానీ తిరస్కరించకుండా ఉండాలి. అసలైన సంపదలు అంటే గురుభక్తి కలిగి ఉండడం, తల్లిదండ్రులంటే భక్తి కలిగి ఉండడం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less