" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 14 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : నవమి రా. 09గం౹౹58ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ ఉ. 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : సిద్ధ ఉ. 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి సాధ్య కరణం : తైతుల ఉ. 10గం౹౹54ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : మ. 12గం౹౹01ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు అమృతకాలం : రా. 08గం౹౹56ని౹౹ నుండి 10గం౹౹25ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు 🕉️విషువత్ పుణ్యకాలం, సౌర యుగాది, మేష సంక్రమణము, వరాహ జయంతి, భగవాన్ శ్రీ రమణ మహర్షి నిర్యాణం (ఏప్రిల్ 14, 1950)🕉️ గురుబోధ విషువత్ పుణ్యకాలం సం౹౹లో రెండు సార్లు వస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమానంగా ఉండే రోజుల్ని విషువత్ పుణ్యకాలం అంటారు. ఏప్రిల్ 14 నాడు యుగాది, సంక్రమణం కూడా కలిసి రావడం మరింత విశేషము. ఈ పర్వదినములలో సత్యహరిశ్చంద్ర చరిత్ర వంటి పురాణగాథలను వినడం లేదా ఏ జపం, పురాణపఠన, శ్రవణం, దానము, తర్పణాలు (అర్హత కలిగినవారు) ఇవ్వడం లేదా ఏ పుణ్యకార్యం చేసినా అనంత పుణ్యం లభిస్తుందని శాస్త్రం.