April 13 2026ఏప్రిల్ 13 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 13 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి రా.9.32 కు తదుపరి ద్వాదశి 14 రా.9.12 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ధనిష్ఠ మ.12.48 కు తదుపరి శతభిషం 14 మ.1.18 కు
యోగం: శుక్ల మ.3:39 కు తదుపరి బ్రహ్మ 14 మ.1:24 కు
కరణం: బవ మ.1:19 కు తదుపరి కౌలవ 14 మ.12:46 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.41 - 1.30 కు, మ. 3.09 - 3.59 కు
వర్జ్యం: రా.8.09 - 9.47 కు
అమృతకాలం: తె. 05.17 - 06.56 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు

🕉️ ఏకాదశి, వల్లభాచార్య జయంతి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు చేయాలి.

గురుబోధ:
ఏకాదశిని విష్ణుతిథి అని, ద్వాదశిని హరివారం అని పిలుస్తారు. ఏకాదశి అని పేరు వినగానే యమకింకరులు భయపడతారు అని పద్మ పురాణం చెపుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రోజు ఉపవాసం ఉండి, తలస్నానం చేసి శ్రీ విష్ణుసహస్రనామములు పారాయణ చేసి భక్తితో గురువును సేవిస్తే పొరపాటున కూడా యమకింకరులు దగ్గరకి రాలేరు. ఈ ఏకాదశీ వ్రతం చేయడం వలన భయంకరమైన దోషాలు కూడా నశిస్తాయి. ఈ రోజు శివునికి మరియు విష్ణువునకు అభిషేకం చేయాలి. శ్రీ సూక్తం, పురుషసూక్తంతో, తులసీదళాలతో శివకేశవులను అర్చన చేయడం చాలా మంచిది.

శ్రీ వాసుదేవ స్తోత్రమ్👇
https://youtu.be/J658-6zYEPg?si=ZDhUiO2qwDQk8Ir_
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-stotram-padma-puranam/pcatid/108/
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX
PDF - https://srivaddipartipadmakar.org/stotram/sri-vasudeva-satanaamaavali/pcatid/108/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less