April 13 2025ఏప్రిల్ 13 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 13 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: పూర్ణిమ ఉ.6.27 కు తదుపరి పాడ్యమి పూర్తిగా ఉంది
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: చిత్త రా.7.40 కు తదుపరి స్వాతి 14 రా.10.17 కు
యోగం: హర్షణ సా.8:39 కు తదుపరి వజ్ర 14 సా.10:38 కు
కరణం: బాలవ రా.7.52 కు తదుపరి కౌలవ 14 ఉ.8.25 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:49-5:38 కు
వర్జ్యం: రా.1.52-3.38 కు
అమృతకాలం: మ.1.58-3.46 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

🕉️ మేష సంక్రమణం-మేషమాసారంభం సా.5.06 కు🕉️

గురుబోధ:
దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మానుషయజ్ఞము అని ఐదు యజ్ఞములు ఉన్నాయి. వీటిని పంచయజ్ఞములు అంటారు. శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపంగా ఉన్నాడు అని విష్ణుసహస్రనామం చెబుతోంది. కాబట్టి యజ్ఞం విష్ణుస్వరూపం. కలియుగంలో మానవుడై పుట్టిన ప్రతివాడు నిత్యం పంచయజ్ఞములు తప్పక చెయ్యాలి అని పెద్దలు చెప్పారు. కాబట్టి యజ్ఞములను ప్రోత్సహించాలి. దేవయజ్ఞం వీలున్నప్పుడల్లా చెయ్యాలి. ఇది మానవకర్తవ్యం. దేవతల పేర్లు చెప్పి ఎవరైనా యజ్ఞములు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞములకు కొంత ధనం ఇచ్చినా, చేస్తుంటే చూసినా, ధనం ఇవ్వలేక పోయినా, యజ్ఞం చేస్తున్న వారిని తలచుకొని ఆనందించడం, యజ్ఞాలను ప్రోత్సహించడం, కూడా దేవయజ్ఞం చేయడంతో సమానం.

expand_less