April 13 2023ఏప్రిల్ 13 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : అష్టమి రా. 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ. 09గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ 
యోగం : శివ  ఉ. 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  బాలవ మ. 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹47ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు 
వర్జ్యం : సా. 05గం౹౹20ని౹౹ నుండి 06గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 05గం౹౹49ని౹౹ నుండి 06గం౹౹51ని౹౹ వరకు & రా. 02గం౹౹19ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹49ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹11ని౹౹కు


గురుబోధ 
గవామంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ - ఆవు శరీరంలో పదునాలుగు లోకాలు ఉన్నాయి. గోవు గొప్పతనం గురించి శ్రీకృష్ణపరమాత్ముడు, సకల దేవతలు, సమస్త పురాణేతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ వర్ణించాయి. అటువంటి గోవు కాలిగిట్టల నుంచి వచ్చే ధూళి పరమపవిత్రమైనది. దాన్ని ఒంటికి పూసుకోవడం వాయవ్యస్నానం అని పిలువబడుతుంది. మన శరీరంపై ఆవుకాలిగిట్టల ధూళి పడీపడడంతోటే మన పాపాలు తొలగిపోతాయి.

expand_less