April 12 2025ఏప్రిల్ 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ 13 ఉ.6.27 కు తదుపరి పాడ్యమి 14 ఉ.8.31 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: హస్త సా.5.09 కు తదుపరి చిత్త 13 రా.7.40 కు
యోగం: వ్యాఘాత రా.8:40 కు తదుపరి హర్షణ 13 సా.8:39 కు
కరణం: విష్టి సా.4.36 కు తదుపరి బవ 13 ఉ.5.52 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:44-8:34 కు
వర్జ్యం: రా.1.52-3.38 కు
అమృతకాలం: ప.11.23-01.11 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

🕉️ హనుమద్విజయోత్సవం, చైత్రపూర్ణిమ, రౌచ్యమన్వాది🕉️

గురుబోధ:
సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం ||
పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం ||
"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింప జేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"
శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.

expand_less