" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 12 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : షష్ఠి తె. 05గం౹౹23ని౹౹ వరకు తదుపరి సప్తమి రా. 02గం౹౹42ని౹౹ వరకు వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : మూల ఉ. 11గం౹౹18ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం : పరిఘ మ. 01గం౹౹50ని౹౹ వరకు తదుపరి శివ కరణం : విష్టి మ. 03గం౹౹13ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹46ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు & రా. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹21ని౹౹ నుండి 06గం౹౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹50ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు గురుబోధ యజ్ఞములు జరిగినప్పుడు యజ్ఞగుండం చుట్టూ నాలుగుసార్లు ప్రదక్షిణ చేయాలి. అగ్నిహోత్రుడు విష్ణుస్వరూపుడు. అగ్నిః విష్ణు ముఖః అంటే అగ్ని విష్ణువు యొక్క ముఖము. కాబట్టి అగ్ని విష్ణువుయొక్క స్వరూపము కనుక విష్ణువుకు కూడా నాలుగు ప్రదక్షిణలు చేస్తుంటాము. యజ్ఞగుండం చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేస్తే అగ్నికి మనము చేసిన అపచారములు తొలగిపోతాయి.