April 11 2025ఏప్రిల్ 11 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 11 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి 12 తె.4.05 కు తదుపరి పూర్ణిమ 12 పూర్తిగా ఉంది
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర మ.2.56 కు తదుపరి హస్త 12 సా.5.09 కు
యోగం: ధ్రువ సా.7:45 కు తదుపరి వ్యాఘాత 12 రా.8:40 కు
కరణం: గరజి మ.2.10 కు తదుపరి వణిజ 12 తె.3.22 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:34-9:24 కు, మ. 12:41-1:31 కు
వర్జ్యం: రా.12.07-1.52 కు
అమృతకాలం: ఉ.7.08 - 8.55 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.
శ్లో౹౹ ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి

expand_less