కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా.7.33 కు తదుపరి నవమి 11 రా.8.42 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.8.25 కు తదుపరి ఉత్తరాషాఢ 11 ఉ.10.20 కు
యోగం: సిద్ధ సా.6:38 కు తదుపరి సాధ్య 11 సా.6:15 కు
కరణం: కౌలవ రా.11:16 కు తదుపరి గరజి 11 రా.12:38 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.35 - 9.24 కు, మ. 12.42 - 1.31 కు
వర్జ్యం: సా.5.03 - 6.47 కు
అమృతకాలం: ఉ. 06.07 - 07.54 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు
గురుబోధ:
పుష్కర సమయంలో నదులలో, భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని, స్నానం చేసి ఉపవాసాలు, దానాలు, యజ్ఞాలు, పురాణ శ్రవణాలు చేసే వారికి, ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial