April 10 2023ఏప్రిల్ 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : చతుర్థి ఉ. 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి పంచమి 
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : అనూరాధ మ. 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ 
యోగం : వ్యతీపాత  రా. 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  బాలవ ఉ. 07గం౹౹07ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 06గం౹౹46ని౹౹ నుండి 08గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

👉🏻🕉️వ్యతీపాత యోగం🕉️


గురుబోధ 
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

expand_less