కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసము శుక్లపక్షం
తిథి: పాడ్యమి రా. 10.14 కు తదుపరి విదియ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రేవతి ఉ. 8.35 కు తదుపరి భరణి
యోగం: వైధృతి మ. 02.18 కు తదుపరి విష్కంభ
కరణం: కింస్తుఘ్న ఉ. 10.08 కు తదుపరి బవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.34 - 09.24 కు & రా. 11.08 - 11.54 కు
వర్జ్యం: తె. 3.38 - 5.03 కు
అమృతకాలం: ఉ. 6.22 - 7.52 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు
🕉️ శ్రీ క్రోధి నామసంవత్సర తెలుగు సంవత్సరాది, యుగాది, వసంత నవరాత్రులు ప్రారంభం 🕉️
గురుబోధ:
యుగాది నాడు చేయవలసిన పనులలో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. పంచాంగం విన్నవారు, వినడానికి ఏర్పాట్లు చేసినవారు తరిస్తారు అని శాస్త్రం.
యుగాది రోజున తప్పక చేయవలసిన పనులు: 1) సూర్యోదయానికి ముందు లేచి నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకుని అభ్యంగన స్నానం, 2) ఇష్టదేవతారాధనతో పాటు తప్పక లక్ష్మీదేవి పూజ, 3) శ్రీసూక్తం పారాయణం చేయడం లేక వినడం, 4) రుద్రాభిషేకం, 5) వేపపూతతో చేసిన షడ్రుచుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టి గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించడం, 5) ఆలయదర్శనం, 6) సూర్యుడు అస్తమించే లోపు పంచాంగశ్రవణం, 7) అన్నదానం, 8) గురుదర్శనం, 9) గురుప్రదక్షిణ, 10) వ్యాస భగవానుడి కథ వినడం, 11) సంధ్యాసమయంలో లక్ష్మీదేవికి దీపారాధన లేదా దీప దర్శనం, 12) గోప్రదక్షిణ మఱియు గోపూజ,13) పురాణశ్రవణం 14) మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం వంటివి అన్నీ చేయడం ఎంతో ఉత్తమం మరియు సకలశుభప్రదం.
శ్రీ క్రోధి నామ సంవత్సర యుగాది పంచాంగ శ్రవణం - బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు
https://youtu.be/5-e8y2M3t2I?si=BEQyYfwbIU1BQMbs