" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 09 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : తదియ ఉ. 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : భానువారం (అదివారం) నక్షత్రం : విశాఖ మ. 01గం౹౹52ని౹౹ వరకు తదుపరి అనూరాధ యోగం : సిద్ధి రా. 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : విష్టి ఉ. 08గం౹౹05ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు వర్జ్యం : సా. 05గం౹౹47ని౹౹ నుండి 07గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹05ని౹౹ నుండి 06గం౹౹40ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు 👉🏻🕉️సంకటహర చతుర్థి🕉️ గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. గురుబోధ ఎప్పుడూ భిక్ష వేసేవాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళి భిక్షుకులకి భిక్ష వెయ్యాలి. ఒకవేళ గొప్ప గొప్ప మహాత్ములు, మహాపండితులు, మహాజ్ఞానులు అదృష్టం కొద్దీ వేరే పని మీద మన ఇంటివైపు వస్తే వారిని లోపలకు ఆహ్వానించి, కాళ్ళు కడగాలి, ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాలి. వినయంగా దానం చెయ్యాలి. అంతేగాని మనము గడపలోపల ఉండి అవతలి వారు గడప బయటౌండి ఈ మధ్యలో గడప అడ్డంగా ఉన్నప్పుడు ఇవతల నుండి అవతలకి చెయ్యి చాచి భిక్ష వేస్తే అవతలి వారి పాపాలు మనకి వస్తాయి.