కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 08 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా 12.26 కు తదుపరి పాడ్యమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ. 10.09 కు తదుపరి రేవతి
యోగం: ఐంద్ర సా. 06.14 కు తదుపరి వైధృతి
కరణం: చతుష్పాద మ. 01.34 కు తదుపరి నాగ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.43 - 01.33 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: రా. 9.22 - 10.52 కు
అమృతకాలం: తె. 5.50 - 7.10 కు
సూర్యోదయం: ఉ. 6.05 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు
👉🕉️ సోమవతీఅమావాస్య 🕉️👈
గురుబోధ:
ఫాల్గుణ మాసంలో అమావాస్య నాడు విప్రులకు భోజనము పెట్టినా పితృదేవతలను తలచుకొని వారి ప్రీతికై స్వయంపాకాదులు దానం చేసినా వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ పని పసివారి నుండి ముసలివారి వరకూ అందరూ చేయవచ్చును.
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
సోమవతీ అమావాస్య నాడు రాహుకాలం సమయంలో శివలింగదర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం. శివపంచాక్షరీ స్తోత్రం శ్రవణం చేయడం, పారాయణం చేయడం సకలపుణ్యప్రదం.
శివకవచం👇*
https://youtu.be/7BLfiL4Tk5s?si=6hshZZOnvO9oByby