" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 08 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము తిథి : విదియ ఉ. 09గం౹౹59ని౹౹ వరకు తదుపరి తదియ వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : స్వాతి మ. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం : వజ్ర రా. 10గం౹౹29ని౹౹ వరకు తదుపరి సిద్ధి కరణం : గరజి ఉ. 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹32ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం : తె. 05గం౹౹05ని౹౹ నుండి ఉ. 06గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹53ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు గురుబోధ తల్లిదండ్రుల దయవల్ల మనకు ఈ దేహం వచ్చింది. విజ్ఞానం వచ్చింది. వారి వల్లే సంపదలు వస్తున్నాయి. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు భక్తితో గౌరవం ఇవ్వాలి. వేదములు చదివితే వచ్చే పుణ్యం, భగవంతుడికి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే పుణ్యం తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తే, వారిని పూజిస్తే వస్తుంది. తల్లిదండ్రులను పూజించడం వలన పాండిత్యం కలవారుగా, ఉన్నత స్థానాలను పొందేవారిగా తయారవుతారు. ఒకవేళ పూజించకపోయినా కానీ తిరస్కరించకుండా ఉండాలి. అసలైన సంపదలు అంటే గురుభక్తి కలిగి ఉండడం, తల్లిదండ్రులంటే భక్తి కలిగి ఉండడం.