కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 07 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి మ.2.04 కు తదుపరి షష్ఠి 8 సా.4.07 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ 8 తె.3.35 కు తదుపరి మూల 9 ఉ.6.08 కు
యోగం: వరీయాన్ సా.5:10 కు తదుపరి పరిఘ 8 సా.5:57 కు
కరణం: తైతుల సా.4:35 కు తదుపరి వణిజ 8 రా.7:02 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.37 - 9.26 కు, రా. 11.07 - 11.54 కు
వర్జ్యం: ఉ.7.10 - 8.57 కు
అమృతకాలం: రా. 08.00 - 09.48 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.26 కు
గురుబోధ:
ఇతరుల ఎంగిలి, కలుషితమైన ఆహారం, స్నానం చేయకుండా వండిన ఆహారం తినరాదు. పూర్వం విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య విభేదాలు తలెత్తి, మధ్యలో సరస్వతీ నదిని రక్తం అయి ప్రవహించమని విశ్వామిత్రుడు శపించాల్సి వస్తుంది. రాక్షసులు ఆ నదిలోని రక్తం త్రాగుతూ ఎంతో సంతోషించారు. కానీ సంవత్సరం తర్వాత అరుణ అనే నది సరస్వతిలో కలవడం చేత సరస్వతి మళ్ళీ దివ్యమైన నదిగా మారింది. నిరాశ చెందిన రాక్షసులకు ఎవరయితే ఎంగిలి, కలుషితపదార్థాలు, అశుచిగా వండిన తిండి, తింటారో వారి వద్ద సూక్ష్మంగా తినమని వరం లభిస్తుంది. అందుకే సాధకులు, ఆచార సంప్రదాయం పై మక్కువ ఉన్నవారు, భక్తులు అత్యవసరము అయితే తప్ప బయటపదార్థాలు తినరు. ఎంగిలి తినరు.
- శ్రీ వామనమహాపురాణం
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial