కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: దశమి రా.1.17 కు తదుపరి ఏకాదశి 8 రా.1.25 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పుష్యమి ఉ.9.58 కు తదుపరి ఆశ్లేష 8 ఉ.10.28 కు
యోగం: ధృతి సా.6:18 కు తదుపరి శూల 8 సా.6:10 కు
కరణం: తైతుల ఉ.7.37 కు తదుపరి గరజి రా.8.00 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:42-1:31 కు, మ. 3:10-3:59 కు
వర్జ్యం: సా.6.03-7.39 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
🕉️ ధర్మరాజదశమి🕉️
గురుబోధ:
శ్రీరాముడు చైత్రమాసం నవమీ తిథి, పునర్వసు నక్షత్రంలో అవతరించాడు. భరతుడు దశమీ తిథి, పుష్యమీ నక్షత్రం, ఆ మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ఆశ్లేషానక్షత్రం లో జన్మించారు.