April 07 2023ఏప్రిల్ 07 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : పాడ్యమి ఉ. 10గం౹౹10ని౹౹ వరకు తదుపరి విదియ 
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : చిత్త మ. 01గం౹౹33ని౹౹ వరకు వరకు తదుపరి స్వాతి 
యోగం : హర్షణ  రా. 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి వజ్ర 
కరణం :  కౌలవ ఉ. 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు & మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 07గం౹౹14ని౹౹ నుండి 08గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹00ని౹౹ నుండి ఉ. 05గం౹౹53ని౹౹ వరకు & ఉ. 06గం౹౹54ని౹౹ నుండి 08గం౹౹33ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹53ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు


గురుబోధ 
దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మానుషయజ్ఞము అని ఐదు యజ్ఞములు ఉన్నాయి. వీటిని పంచయజ్ఞములు అంటారు. శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపంగా ఉన్నాడు అని విష్ణుసహస్రనామం చెబుతోంది. కాబట్టి యజ్ఞం విష్ణుస్వరూపం. కలియుగంలో మానవుడై పుట్టిన ప్రతివాడు నిత్యం పంచయజ్ఞములు తప్పక చెయ్యాలి అని పెద్దలు చెప్పారు. కాబట్టి యజ్ఞములను ప్రోత్సహించాలి. దేవయజ్ఞం వీలున్నప్పుడల్లా చెయ్యాలి. ఇది మానవకర్తవ్యం. దేవతల పేర్లు చెప్పి ఎవరైనా యజ్ఞములు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞములకు కొంత ధనం ఇచ్చినా, చేస్తుంటే చూసినా, ధనం ఇవ్వలేక పోయినా, యజ్ఞం చేస్తున్న వారిని తలచుకొని ఆనందించడం, యజ్ఞాలను ప్రోత్సహించడం, కూడా దేవయజ్ఞం చేయడంతో సమానం.


expand_less