"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 05 2022🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షము
తిథి: చతుర్థి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: కృత్తిక మధ్యాహ్నం 03గం౹౹54ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం: ప్రీతి ఈ రోజు ఉదయం 08గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹45ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹24ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹51ని౹౹ నుండి 11గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మధ్యాహ్నం 01గం౹౹18ని౹౹ నుండి 03గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹55ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు
గురుబోధ:
కలిపురుషుడు పెట్టే కష్టాల నుండి బయట పడాలంటే నలదమయంతుల చరిత్రను శ్రద్ధతో వినాలి లేదా ఈ శ్లోకాన్ని లేస్తూనే స్మరించుకోవాలి,
(మహాభారతం)
◆ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ||