" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 04 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : త్రయోదశి ఉ. 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి చతుర్దశి (5వ తేదీ) ఉ. 09గం౹౹00ని౹౹ వరకు వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పుబ్బ ఉ. 09గం౹౹25ని౹౹ వరకు వరకు తదుపరి ఉత్తర యోగం : వృద్ధి (5వ తేదీ) రా. 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి ధ్రువ కరణం : తైతుల ఉ. 06గం౹౹35ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹13ని౹౹ వరకు & 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం : సా. 05గం౹౹10ని౹౹ నుండి 06గం౹౹53ని౹౹ వరకు అమృతకాలం : తె. 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹13ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు 🕉️మదన త్రయోదశి, భౌమ చతుర్దశి,🕉️ గురుబోధ* పూర్వం ఉజ్జయిని ప్రాంతంలో క్షిప్రా నది లేదు. అందుకని ఒకప్పుడు కార్తవీర్యార్జునుడనే మహారాజు బ్రహ్మకోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈ మహా కాళేశ్వర దివ్య స్మశాన ప్రాంగణంలో ఒక్క నది కూడా లేదు. ఇక్కడ గంగను ప్రసాదించమని వేడుకుంటాడు. బ్రహ్మ శివుడ్ని నందివర్ధనం పూలతో పూజించి గంగను కమండలంలో నింపమంటాడు. నింపగానే బ్రహ్మ గంగను పర్వతాల్లో వొలకబోశాడు. అలా ప్రవహిస్తూ అక్కడికి చేరింది. వరం కోరీకోరగానే తక్షణం ఇచ్చాడు కనుక క్షిప్రా (వెంటనే) నది అని పేరు. మంగళమహాదేవుడ్ని దర్శించుకుంటే కుజదోషాలు తొలగి పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది.