April 03 2023ఏప్రిల్ 03 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 03 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : ద్వాదశి ఉ. 06గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి (4వ తేదీ) ఉ. 07గం౹౹42ని౹౹ వరకు 
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : మఖ ఉ. 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి పుబ్బ (4వ తేదీ) ఉ. 09గం౹౹25ని౹౹ వరకు
యోగం : గండ  (4వ తేదీ) రా. 02గం౹౹11ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  కౌలవ సా. 05గం౹౹47ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు & 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : సా. 03గం౹౹56ని౹౹ నుండి 05గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹48ని౹౹ నుండి 06గం౹౹18ని౹౹ వరకు & రా. 02గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹09ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹57ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

గురుబోధ 
చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి ఉత్తరఫల్గునీ నక్షత్రం నాడు దక్షారామంలో భీమేశ్వరుడు ఆవిర్భవించాడు అందుకే చైత్రమాసములో  శుక్లపక్షత్రయోదశి లేదా ఉత్తరఫల్గునీ లేదా ఆదివారం నాడు భీమేశ్వరుని దర్శనం వల్ల సమస్త పాపాలు తొలగి, అంత్యకాలంలో కైలాసం ప్రాప్తిస్తుంది. ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి, కష్టాలు తొలగుతాయి. - శ్రీ శివమహాపురాణం


expand_less