April 02 2024ఏప్రిల్ 02 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 02 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం

తిథి: అష్టమి మ.  3.26 కు తదుపరి నవమి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా.  6.33 కు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: పరిఘ సా.  06.36 కు తదుపరి శివ
కరణం: బాలవ ఉ.  08.44 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.  08.38 - 09.27 కు & రా.  11.09 - 11.56 కు
వర్జ్యం: రా.  2.16 - 3.48 కు
అమృతకాలం: మ.  1.55 - 3.29 కు
సూర్యోదయం: ఉ.  6.10 కు
సూర్యాస్తమయం: సా.  6.30 కు

👉🕉️ శీతలాష్టమి 🕉️👈

గురుబోధ:
ఫాల్గుణశుక్లాష్టమినాడు అమ్మవారు పార్వతీ రూపంలో, ఫాల్గుణ కృష్ణాష్టమి నాడు శీతలాదేవి గా సంచరిస్తుంది. ఈ రెండు అష్టములలోనూ అమ్మవారిని భక్తితో పుష్పాలతో, కుంకుమతో పూజించి అన్న నైవేద్యం తో సంతృప్తిపరచాలి. బహుళాష్టమినాడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి. అలా చేసిన వారికి ఎంత కష్టమైన పని అయినా ఆరునెలలులోగా పూర్తి అవుతుంది. క్లిష్టకార్యాలు పూర్తి చేసుకోవడానికి ఇంతకు మించిన సులభోపాయం మరొకటి లేదు. ఆ శ్లోకాలు ఇవి
శ్లో ||  శీతలే! త్వం జగన్మాతా, శీతలే! త్వం జగత్పితా శీతలేత్వం జగద్ధాత్రీ, శీతలాయై నమోనమః 
శ్లో || వందేహం శీతలాదేవీం, రాసభస్థాం దిగంబరామ్ మార్జనీ కలశోపేతాం విస్ఫోటక వినాశనీమ్

expand_less