April 02 2023ఏప్రిల్ 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : ద్వాదశి (3వ తేదీ) ఉ. 06గం౹౹00ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : మఖ (3వ తేదీ) ఉ. 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : శూల  (3వ తేదీ) రా. 01గం౹౹51ని౹౹ వరకు తదుపరి గండ
కరణం :  బవ మ. 03గం౹౹54ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹55ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : తె. 04గం౹౹32ని౹౹ నుండి 05గం౹౹58ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఆదివారం ఉదయం చేయవచ్చును.

గురుబోధ 

భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.

శ్లో౹౹
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ 
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి


expand_less