April 01 2026ఏప్రిల్ 01 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి ఉ.6.28 కు తదుపరి పూర్ణిమ 02 ఉ.6.38 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తర సా.3.48 తదుపరి హస్త 02 సా.4.47 కు
యోగం: ధ్రువ మ.2:19 కు తదుపరి వ్యాఘాత 02 మ.2:08 కు
కరణం: విష్టి రా.7:21 కు తదుపరి బాలవ 02 రా.8:09 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.55 - 12.44 కు
వర్జ్యం: రా.12.32 - 2.12 కు
అమృతకాలం: ఉ. 08.47 - 10.27 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు

🕉️ చైత్రపూర్ణిమ, హనుమద్విజయోత్సవం, ఒంటిమిట్ట శ్రీసీతారామ కళ్యాణం,రౌచ్యమన్వాది 🕉️

గురుబోధ:
🕉️ సదా రామ రామేతి రామామృతం తే | సదా రామమానందనిష్యందకందం ||
పిబంతం సమంతం హసంతం సుదంతం | హనూమంతం అంతర్భజే తం నితాంతం ||
🕉️"ఎల్లవేళలా రామనామాన్ని గ్రోలుతూ, నమస్సులు అర్పిస్తూ, తద్వారా పెల్లుబికిన ఆ ఆనందంతో స్వచ్ఛమైన తన దంతముల కాంతిని నలు దిశలా వ్యాపింపజేస్తూ చిరునవ్వులు చిందిస్తూ, రామ నామమే శ్వాసగా జీవించే హనుమంతుణ్ణి నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను"
🕉️శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రంలోని ఈ శ్లోకంతో హనుమంతుని స్తుతించి ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తే విజయం లభిస్తుంది.
https://youtu.be/kCmiAy93_Eo?si=isR_wlxN8uWb2EWZ

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less