కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 01 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం తిథి: సప్తమి సా. 4.35 కు తదుపరి అష్టమి వారం: ఇందువారము (సోమవారం) నక్షత్రం: మూల రా. 7.03 కు తదుపరి పూర్వాషాఢ యోగం: వరీయాన్ రా. 08.30 కు తదుపరి పరిఘ కరణం: విష్టి ఉ. 08.25 కు తదుపరి బవ రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు దుర్ముహూర్తం: మ. 12.45 - 01.34 కు & మ. 03.12 - 04.02 కు వర్జ్యం: తె. 4.27 - 6.01 కు & సా. 5.27-7.03 కు అమృతకాలం: మ. 12.44 - 2.20 కు సూర్యోదయం: ఉ. 6.11 కు సూర్యాస్తమయం: సా. 6.29 కు గురుబోధ: ఫాల్గుణమాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి ఫాల్గుణ మాసాలు సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందుదాము.