April 01 2023ఏప్రిల్ 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 01 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : ఏకాదశి (2వ తేదీ) తె. 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : ఆశ్లేష (2వ తేదీ) తె. 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి మఖ
యోగం : ధృతి  (2వ తేదీ) రా. 01గం౹౹15ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  వణిజ  మ. 01గం౹౹40ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹37ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹14ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹59ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీ పారణము ఆదివారం చేయవచ్చును.

గురుబోధ 

చైత్ర శుక్లపక్ష ఏకాదశి శ్రీ శుక్రజయంతి(ఏప్రిల్ 1, శనివారం)

శుక్ర గ్రహ ధ్యాన శ్లోకం!
హిమకుంద మృణాళాభం |
 దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | 
 భార్గవం ప్రణమామ్యహం ||

expand_less