Apr 04 2026ఏప్రిల్ 04 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 04 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ ఉ.8.30 కు తదుపరి తదియ 5 ఉ.10.06 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: స్వాతి రా.8.12 కు తదుపరి విశాఖ 5 రా.10.28 కు
యోగం: వజ్ర మ.2:43 కు తదుపరి సిద్ధి 5 మ.3:25 కు
కరణం: వణిజ రా.11:02 కు తదుపరి బవ 5 తె.1:03 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.50 - 8.39 కు
వర్జ్యం: రా.2.20 - 4.05 కు
అమృతకాలం: ఉ. 11.58 - 01.43 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 6.26 కు

గురుబోధ:
భాగవత గ్రంథాన్ని తలపై పెట్టుకొని గోవిందుడి నామస్మరణ చేస్తూ విష్ణ్వాలయంలో 3 ప్రదక్షిణలు చేసి భక్తుడికి దానం ఇస్తే, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును మోసిన ఫలం లభిస్తుంది. భూమండలం, స్వర్గ, పాతాళ లోకాలు (త్రిలోకాలు) ఒకవైపు, భాగవతమొక్కటీ మరొకవైపు త్రాసులో పెడితే భాగవతమే బరువు తూగుతుంది, అంటే ఇక దాని శక్తి ఊహించలేనిది. సమస్తవేదాలు చదివినఫలం కూడా, సర్వశాస్త్ర ఫలసారమైన, భాగవతానికి సరితూగదు. భాగవతం వింటే ముక్తినిస్తుంది. భగవంతునికి భాగవతానికి తేడా లేదు. - శ్రీ స్కాందపురాణం

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less