కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: పూర్ణిమ ఉ.6.38 కు తదుపరి బ.పాడ్యమి 3 ఉ.7.21 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: హస్త సా.4.47 కు తదుపరి చిత్ర 3 సా.6.17 కు
యోగం: వ్యాఘాత మ.2:08 కు తదుపరి హర్షణ 3 మ.2:16 కు
కరణం: బాలవ రా.8:09 కు తదుపరి తైతుల 3 రా.9:23 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.17 - 11.06 కు, మ. 3.10 - 3.59 కు
వర్జ్యం: రా.1.18 - 3.00 కు
అమృతకాలం: ఉ. 11.18 - 12.59 కు
సూర్యోదయం: ఉ. 6.13 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు
గురుబోధ:
జలదానం అత్యంత పవిత్రమైన, ఉత్కృష్టమైన దానం. జలదానం చేయనివారు మరుజన్మలో బల్లిగా పుడతారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవచేసినవారు సర్వశుభాలను పొందుతారు. పూర్వజన్మలో జలదానం చేయని పాపం వేంకటాద్రిపై చేసే జలదానం వలన తొలగుతుంది. - శ్రీ స్కాందపురాణం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial