"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము
తిథి : పంచమి ఉ. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా. 01గం౹౹20ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : గండ రా. 02గం౹౹18ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : బాలవ ఉ. 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹05ని౹౹ నుండి 07గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : ఉ.10గం౹౹09ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹15ని౹౹ నుండి 08గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹09ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు
గురుబోధ
కంద, పెండలము వంటి దుంపలు (బంగాళదుంపలు కాదు) పంచమి రోజు దానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది.
పంచమిరోజు ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమందికి శక్తి మేర స్వయంపాకం దానం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది.
నక్తం అంటే రాత్రి నక్షత్ర దర్శనమ్ తర్వాత ఉపవాసం విరమించవచ్చు.
పంచమిరోజు తల్లిదండ్రులకు నమస్కరిస్తే మణిద్వీపంలో ఉన్న అమ్మకు నమస్కరించినట్లే. తల్లికి నమస్కరిస్తే ఉదర సంబంధ వ్యాధులు తొలగుతాయి.
అజామిలోపాఖ్యానం పూర్తిగా ఈరోజు కూడా వినాలి.
ఆడవారు శివలింగాన్ని పూజించవచ్చునా?👇
కార్తికమాసం దామోదరలీలలు - పూతనా సంహారం👇