" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 03 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షము తిథి : దశమి ఉదయం 08గం౹౹19ని౹౹ వరకు తదుపరి ఏకాదశి, ఆదివారం ఉదయం 7 వరకు ఉంది(ఏకాదశి ఉపవాసం ఈరోజు ఉండాలి) వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర ఈ రోజు ఉదయం 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : వ్యతీపాత తెల్లవారి (04వ తేదీ) 07గం౹౹30ని౹౹ వరకు తదుపరి వరీయాన్ కరణం : వణిజ ఈ రోజు సాయంత్రం 05గం౹౹33ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 08గం౹౹47ని౹౹ నుండి 10గం౹౹21ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉ. 06గం౹౹18ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹ ఏకాదశి గీతాజయంతి వ్యతీపాత యోగం- పితృతర్పణం ఏకాదశి ఉపవాసం ఈరోజు ఉండాలి(శనివారం). ద్వాదశి పారణము ఆదివారం ఉదయం 7 తరువాత చేయచ్చు. గురుబోధ గీతాజయంతి నాడు భగవద్గీత పారాయణము లేదా శ్రవణము చేసినవారికి లక్షగోవులను దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం(30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా పారాయణం👇🏼👇🏼 https://youtu.be/tMPVWLT9ZA0