Sri Anjaneyam – ART Competition Registration May, 2023 శ్రీ ఆంజనేయం - చిత్రలేఖన పోటీలు May, 2023favorite_border

శ్రీ మహాగణాధిపతయేనమః 
శ్రీ గురుభ్యోనమః

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరియు ధర్మపత్ని శ్రీమతి రంగవేణి అమ్మగారి కి శతకోటి పాదాభివందనములు. 

చిత్రాలేఖనపు పోటీలు 
మీ వయసు యొక్క పరిమితిబట్టి, మీ విభాగంలో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రాలని వేసి  గురువుగారు కృప కి, ఆ స్వామి  కటాక్షానికి పాత్రులుకండి.

శ్రీ ఆంజనేయం - చిత్రలేఖన పోటీలు - విభాగాలు

1వ విభాగము.  15 సం|| లోపు వారు
a) శ్రీ బాలాంజనేయ స్వామి
(కూర్చొని ప్రసన్నంగా ఉన్న బాలాంజనేయుని కానీ  లేదా సూర్యుని మింగుతున్న బాలాంజనేయుని కానీ చిత్రీకరించవలెను)

b) శ్రీ ఆంజనేయస్వామి వారి వాహనము
(ఒక్క వాహనం మాత్రమే  చిత్రీకరించవలెను)

c)  శ్రీ ధ్యానాంజనేయుడు
(ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయుని చిత్రీకరించవలెను)

2వ విభాగము. 15 సం|| నుండి పైబడిన వారు
a) సంజీవ రాయుడు
(ద్రోణ పర్వతాన్ని చేతితో పట్టుకొని ఉన్న ఆంజనేయుని చిత్రీకరించవలెను) 

b) శ్రీ పంచముఖ ఆంజనేయుడు
( వానర ,  నరసింహ, గరుడ,  వరాహ,  అశ్వముఖములతో   పంచముకుడై వివిధ అలంకారములతో, మూడు ఐదుల నేత్రములు కలిగి ప్రకాశించు దేహ కాంతులతో కరకమలముల యందు కత్తి, డాలు, పుస్తకము, అమృత బాండము, అంకుశం, కొండ, నాగలి, మంచపుకోడు, పాము, వృక్షములు ధరించిన ఉన్న  స్వామిని చిత్రీకరించవలెను) 

c) శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి 
(స్వామి వీరాసనంలో ఉండగా సువర్చలాదేవి ఆయన వామ భాగములో కూర్చుని ఉండేటట్లుగా చిత్రీకరించవలెను)



Instructions for art: 
 అభ్యర్థి తన వయో విభాగం నుండి ఇవ్వబడిన అంశాలను మాత్రమే ఎంచుకోవలి 

మీ వయోవిభాగం లో ఇవ్వబడ్డ అంశాలకు సంబంధించి మీరు సమర్పించినవి మాత్రమే స్వీకరించబడుతుంది. అన్య వయో విభాగం నుండి మరియు ఇతర అంశాల నుండి మీరు సమర్పించే చిత్రాలు తిరస్కరించబడతాయి.

 చిత్రాన్ని ఏ పరిమాణం లో అయినా, ఏ మాధ్యమం లో అయిన చిత్రించవచ్చు (ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో చేసిన చిత్రకళలను పరిగణలోకి తీసుకోబడదు).

చిత్రకళ పై అసక్తి గురుభక్తి కలిగిన వారందరూ అర్హులే.

 పోటీలో పాల్గొనటానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.

  ఒక అభ్యర్థి ఒక్క చిత్రాన్ని మాత్రమే సమర్పించాలి, ఒకటికి మించి సమర్పిస్తే అభ్యర్థిని అనర్హులు గా ప్రకటిస్తారు.

 నిపుణుల బృందం అభ్యర్తుల చిత్రాలను సమగ్రంగా పరిశీలించి న్యాయ నిర్ణయం చేస్తారు. విజేతల ప్రకటన పూర్తిగా న్యాయమూర్తుల నిర్ణయం, ఇతరుల ప్రమేయం, ప్రభావం ఉండదు

 ఇవ్వబడిన గడువులోపు మాత్రమే అభ్యర్థి సమర్పించాలి. గడువు పూర్తి అయిన తర్వాత సమర్పించిన చిత్రాలని పరిగణనలోకి తీసుకొనబడవు.

అభ్యర్థి గీసిన చిత్రానీ మొత్తం  మూడు  దశలో చిత్రాలు సమర్పించాలి

మొదటి దశ:
మీరు చిత్రాన్ని వేస్తున్నప్పుడు, సగం పూర్తి అయిన చిత్రం పై తేదీ, నెల, సంవత్సరం రాయాలి (ఉదాహరణ:13-04-2023) , ఆలా తేది రాశాక సగం పూర్తి అయిన చిత్రం తో మీరు ఫోటో తీసుకొని  ఇవ్వబడిన వెబ్సైట్  లింక్ లో సమర్పించాలి

రెండవ దశ:
పూర్తి చేసిన మీ చిత్రం తో సెల్ఫీ తీసుకొని,ఆ ఫోటో ని ఇవ్వబడిన  వెబ్సైటు లింక్ ద్వారా సమర్పించాలి 

మూడవ దశ:
పూర్తి అయిన మీ చిత్రాన్ని మాత్రమే ఫోటో తీసి  సమర్పించాలి 

పైన చెప్పిన విధంగా 3 దశలను చిత్రాలను సమర్పించలిసి ఉంటుంది. ఏ దశలో అయిన అసంపూర్ణముగా వదిలేస్తే మీ అభ్యర్తిత్వాన్ని తిరస్కరించటం జరుగుతుంది. 

నమోదు కి ఆఖరు తేదీ April 25th, 2023
శ్రీఆంజనేయం యూట్యూబ్ లింక్



ధన్యవాదములు
జయశ్రీరామ🙏
బలంవిష్ణోఃప్రవర్ధతాం
బలంగురోఃప్రవర్ధతాం
🙏🙏🙏
Form closed. ఫారమ్ మూసివేయబడింది.
expand_less