శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యో నమః
శ్రీ మాత్రే నమః
బ్రహ్మాండపురాణం ప్రకారం బండాసురుడికి 32 మంది కుమారులు ఉన్నారు వీరిని చంపాలంటే 11 సంవత్సరాల లోపు వయసుగల దేవత వల్ల మాత్రమే అవుతుందని బ్రహ్మ వరం. అప్పుడు అమ్మవారు బాల అనే పేరుతో ఒక శక్తిని సృష్టించింది ఈ శక్తి లలితాంబిక పుత్రి.
దేవీ నవరాత్రులు అనగానే మనకు గుర్తుకు వచ్చేది బాలా పూజ. రెండు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం మన ఆనవాయితీ. ఇందులో భాగంగా మనం బాలికలను అమ్మవారి లాగా అలంకరించుకొని వారిలో అమ్మను చూసుకొని పూజించి సంతోషిస్తాము. ప్రతి స్త్రీలోను అమ్మ ను చూస్తాము, కావున ఈ నవరాత్రులలో ప్రతి స్త్రీ మూర్తి వయస్సుతో సంబంధం లేకుండా అమ్మవారి రూప ప్రదర్శన పోటీలలో పాల్గొనవచ్చును(విభాగాల ప్రకారం).
కావునా స్త్రీ మూర్తులందరికీ ఇదే మాసాదర ఆహ్వానం 🙏.
నవరాత్రి స్వరూప పోటీలు (ఆడవారికి మాత్రమే)
విభాగాలు
1వ విభాగము. 16 సం|| లోపు : బాలాత్రిపుర సుందరీ/గాయత్రీ దేవీ
2వ విభాగము. 17 నుండి 30 సం|| : లక్ష్మీదేవి/అన్నపూర్ణా దేవి
3వ విభాగము. 31వ సం|| నుండి పైబడిన వారు : సరస్వతీ దేవి/లలితా దేవి .
శ్రీ దేవీ నవరాత్రి స్వరూప పోటీకి పాటించవలసిన నియమములు:
->వయోపరిమితం లేకుండా ఆడవాళ్లు అందరు ఈ పోటీకి అర్హులు.
->పోటీ అంతర్జాల వేదికగా జరుగుతుంది.
->పోటీకి అరగంట ముందుగానే జాయిన్ అవగలరు.
->పోటీ లో పాల్గొనే అభ్యర్థులకు వారి వారి సమయాన్ని కేటాయించడం జరిగింది.
->మీ ఇంటర్నెట్ సరిగా ఉందో లేదో ముందుగానే సరిచూసుకోగలరు.
->Background సరిగా ఉందో లేదో ముందుగానే సరి చూసుకోవలెను.
->సమయం ఒకొక్కరికి 5ని. ఇవ్వబడును. ఐదు నిమిషముల వ్యవధిలోనే వారు చెప్పవలసిన పద్యమును కానీ శ్లోకమును కానీ ఉచ్ఛారణ దోషం లేకుండా స్పష్టముగా చెప్పవలెను.
-> న్యాయనిర్ణేతలదే తుది తీర్పు.
స్వరూప పోటీలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదములు.
బలంగురోఃప్రవర్ధతాం బలం విష్ణోః ప్రవర్థతాం 🙏🙏🙏
Form closed. ఫారమ్ మూసివేయబడింది.