Sri Nrisihma Vaaibhavam – Pravachanamశ్రీ నృసింహ వైభవం – ప్రవచనంfavorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Wednesday, September 7, 2022
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Thursday, September 8, 2022
Timeసమయం
6:15 pm to 8:30 pm
Locationస్థానం
Visakhapatnamవిశాఖపట్నం
Venueవేదిక
Vaishakhi Function Hall వైశాఖీ ఫంక్షన్ హాల్
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః

ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం

శ్రీ నృసింహ వైభవం – ప్రవచనం, 07 సెప్టెంబరు 2022 బుధవారం నుండి 08 సెప్టెంబరు 2022 గురువారం వరకు, వైశాఖీ ఫంక్షన్ హాల్, విశాఖపట్నం

సర్వోపగతుడైన శ్రీమహావిష్ణువు ఎత్తిన 22 అవతారాలలో ఒకేసమయంలో ఉగ్రత్వం, కారుణ్యం వర్షించిన అపూర్వ అవతారం శ్రీనృసింహావతారం. భక్తప్రహ్లాదుని అమితభక్తికి మెచ్చి, దుష్టశిక్షణ చెయ్యడానికి భువనబ్రహ్మాండాలు నారసింహతత్త్వంతో నిండగా, శ్రీహరి నరమృగ శరీరధారియై, సహస్రతేజోరాశియై ఆవిర్భవించి హిరణ్యకశిపుని వధించి శిష్టరక్షణ గావించాడు. లక్ష్మీ సమేతుడైన ఆ దివ్యమూర్తి శ్రీనృసింహుడు వెలసిన మహామహిమాన్వితక్షేత్రమైన సింహాచలానికి దగ్గరలో విశాఖపట్నంలో శ్రీమద్భాగవతాన్ని ఆసాంతం ఆపోశన పట్టి, దేశం నలుమూలలా నేటికి 340 భాగవత సప్తాహాలు నిర్వహించిన అభినశుకులు, శ్రీప్రణవపీఠాధీశులు, త్రిభాషామహాసహస్రావధాని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు "శ్రీ నృసింహ వైభవం" అనే ప్రవచనామృతం అందించనున్నారు.
 
శ్రీ నృసింహుని వైభవం వింటే సంసారమనే ఘోర, భయంకర దుఃఖం నుండి ఆలంబన పొంది రక్షింపబడుతాము. భాగవతకల్యాణ కృష్ణ అయిన పూజ్యగురుదేవుల ద్వారా శ్రీనృసింహ వైభవం వినడం సమస్తపాపహరణం, మహద్భాగ్యం. పదిమందికీ తెలియజేసి, అందరూ పాల్గొని, శ్రీ గురుదేవుల అమూల్య ఆశీర్వచనానికి, శ్రీ లక్ష్మీనృసింహ కృపకు పాత్రులుకండి.    

లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
బలం గురః ప్రవర్ధతాం
expand_less