Sri Maha Lakshmi Mahima – Pravachanamశ్రీ మహాలక్ష్మీ మహిమ – ప్రవచనంfavorite_border

pravachanam Start Dateప్రవచనం ప్రారంభపు తేది
Wednesday, September 14, 2022
pravachanam End Dateప్రవచనం చివరి తేది
Thursday, September 15, 2022
Timeసమయం
6:15 pm to 8:30 pm
Locationస్థానం
Bhimavaramభీమవరం
Venueవేదిక
Arya Vaishya Trade Association Building (Thyagaraja Bhavan)ఆర్యవైశ్య వర్తకసంఘ భవనం (త్యాగరాజ భవనం)
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాలక్ష్మ్యై నమః

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ ||

శ్రీ మహాలక్ష్మీ మహిమ – ప్రవచనం, 14 సెప్టెంబరు 2022 బుధవారం నుండి 15 సెప్టెంబరు 2022 గురువారం వరకు, ఆర్యవైశ్య వర్తకసంఘ భవనం (త్యాగరాజ భవనం), భీమవరం

క్షీరసముద్రరాజతనయ, శ్రీమహావిష్ణువుకు పట్టపురాణి అయిన శ్రీమహాలక్ష్మి సకలసంపదలకు నిలయమైన మహాశక్తిస్వరూపం. సమస్తమానవాళికి ధర్మార్థకామమోక్షాలైన చతుర్విధఫలపురుషార్థాలను ప్రసాదించే కారుణ్యరూపం. నిత్యానపాయిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి జగత్పిత అయిన శ్రీమహావిష్ణువును ఎప్పుడూ విడిచిపెట్టదు. అటువంటి పద్మనాభప్రియ అయిన శ్రీమహాలక్ష్మి త్రిమాతలలో ఒకశక్తిగా కొలువై ఉన్న దివ్యక్షేత్రం, భూలోక మణిద్వీపం ఏలూరులో త్రిభాషామహాసహస్రావధాని, సమర్థ సద్గురువులు, అభినవశుక, పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్థాపించబడిన శ్రీప్రణవపీఠం. అష్టాదశపురాణాలను పలుమార్లు తమ ప్రవచనామృతం ద్వారా అందించిన నవయుగ వ్యాసులు శ్రీ గురుదేవులు. వారి అద్భుతరచనలలో ఒక అమృతపద్యకావ్యం లక్ష్మీదేవికి సంబంధించిన "మా"నవకథ.

 ఒకానొకప్పుడు స్వయంగా లక్ష్మీదేవి గురుదేవులకు స్వప్నమునందు దర్శనమిచ్చి తొమ్మిది కథలు పద్య కావ్యంగా వ్రాయమని సూచించగా, అమ్మ ఆజ్ఞకు బద్ధులై రచించడం వారి తపోనిష్ఠకు తార్కాణం.

పూజ్య గురుదేవులు శ్రీ మహాలక్ష్మీ మహిమ అనే ప్రవచనామృతాన్ని వారి ముఖపద్మం ద్వారా అందించనున్నారు. అందులో పాల్గొనడం ఒక అపూర్వయోగం. భాద్రపదమాసంలో లక్ష్మీకటాక్షం, గురుకృప విశేషంగా వర్షించి, మనలను భద్రంగా రక్షించే అమ్మవారి దివ్యప్రవచనయజ్ఞం గురించి పదిమందికీ తెలియజేయండి, అందరూ పాల్గొని తరించండి.

బలం గురోః ప్రవర్ధతాం
expand_less