శ్రీరామాయణ లిఖిత యజ్ఞంశ్రీరామాయణ లిఖిత యజ్ఞంfavorite_border

Start Dateప్రారంభపు తేది
Sunday, January 15, 2023
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః 
జయశ్రీరామ

శ్రీరామాయణ లిఖిత యజ్ఞం

 కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. 
లోకాభిరామం శ్రీరామం  భూయో భూయో నమామ్యహం.

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి  మరియు శ్రీమతి రంగవేణి అమ్మగారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు.

రామ నామము సకల పాప హరమము, మోక్షప్రథము.  శ్రీరామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు)గా విభజింపబడినవి మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు), 
అవి: 
1)బాల కాండ
2)అయోధ్య కాండ 
3)అరణ్య కాండ 
4)కిష్కింధ కాండ 
5)సుందర కాండ 
6)యుద్ధ కాండ 
7)ఉత్తర కాండ

ఇంతటి పరమపావనమైన శ్రీరామాయణం లిఖిత పూర్వక యజ్ఞంగా చేయమని గురుదేవుల ఆదేశం, ఇందులో భాగం గా సంపూర్ణంగా శ్రీరామాయణం (24 వేల శ్లోకాలు), 3 లేదా 6 లేదా 9 లేదా 12నెలల లోపు లిఖిత పూర్వకంగా పూర్తిచెయ్యాలి.

ఈయజ్ఞం ఈసంక్రాంతి (2023) నుండి వచ్చే సంక్రాంతి(2024) లోపు పూర్తి చేయాల్సిఉంటుంది.  ఒకవేళ మీరు పూర్తి చేయలేకపోతుంటే, మీ బంధువుల/సన్నిహితుల సహకారంతో పూర్తి చేయించవచ్చు.

వచ్చే సంక్రాతి(2024) తర్వాత మనం వ్రాసిన పుస్తకాలు శ్రీప్రణవపీఠంకు ఎలా, ఎప్పుడు పంపాలి అని 2024 సంక్రాంతి తర్వాత తెలియజేయగలవారము. 
  
ఇందులో పాల్గొని శ్రీసీతారామ లక్ష్మణ హనుమద్ కృపకు,  అలాగే శ్రీగురు కటాక్షానికి పాత్రులు అవుదాము.
 
ఆసక్తి ఉన్న భక్తులు ఈ టెలిగ్రామ్ లంకె ద్వారా జాయిన్ అవ్వగలరు.
https://t.me/+q6Iu9jT09UM4NGJl
                                                                                                                                                                                                                                                            
బలంవిష్ణోఃప్రవర్ధతాం
బలంగురోఃప్రవర్ధతాం
🙏🙏🙏
expand_less