Details వివరాలు
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పూజ్య గురువులకు జయము జయము
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహా గణాధిపతయేనమః
శ్రీ మాత్రేనమః
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి
పద్మాకర్ గారి దివ్య ఆశీస్సులతో
మన పూర్వపుణ్య విశేషము వలన పూజ్య గురువులు వారి నిర్వహణ ద్వారా 2022 సంవత్సరములో మోక్షపురియైన హరిద్వార్ లో "భాగవతశ్రవణము"చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు.
జూన్ 9 2022 వ సంవత్సరములో " హరిద్వార్ చార్ ధామ్ "యాత్రలకు పూజ్య గురువులతో ప్రయాణం.
జూన్ 11 నుండి జూన్ 17 వరకు శ్రీమద్ భాగవత సప్తాహం. జూన్ 17 వ తేదీ " దధిమధనం, అవభృథస్నానం, పూజ్య గురువులకు సన్మానం." మున్నగు కార్యక్రమములుండును.అనంతరం హరిద్వార్ లో " చండీదేవిని మరియు మానసాదేవిని" దర్శించుకొనుట.
కేవలము భాగవత సప్తాహంలోనే పాల్గొనేవారికి జూన్ 17 వ తేదీ రాత్రి హరిద్వార్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణం.జూన్ 18 వ తేదీ ఉదయం ఢిల్లీ నుండి వారి గమ్యస్థానాలకు ప్రయాణం
ఇక హరిద్వార్ లో పూజ్య గురువుల భాగవత సప్తాహము తో బాటు చార్ ధామ్ యాత్రకు వచ్చిన భాగవతులకు జూన్ 18 వ తేదీ ఉదయం అల్పాహారం, కాఫీ స్వీకరించిన అనంతరం" చార్ ధామ్"యాత్ర ప్రారంభము.
చార్ధామ్ యాత్ర 18-6-2022 నుండి 28-6-2022 వరకు
చార్ ధామ్ యాత్రకు కేవలం 38,000 రూపాయలు మాత్రమే. కేవలం చార్ ధామ్ యాత్రకు వస్తున్న భాగవతులు హరిద్వార్ కు, మరియు తిరుగు ప్రయాణంలో హరిద్వార్ నుండి తమ గమ్య స్థానముల వరకు ప్రయాణం ఏర్పాట్లు ఎవరికి వారే చేసుకోవాలి. జూన్ 17 రాత్రి కి హరిద్వార్ చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవలసినదిగా కోరుతున్నాము. శ్రీ ప్రణవ పీఠము బాధ్యత జూన్ 18 నుండి 28 వరకు, భోజన, వసతి, ప్రయాణ బాధ్యతలు స్వీకరించబడును
వసతి సదుపాయములు :-
దంపతులుగా వచ్చిన వారికి ఇద్దరికి ఒక గది , సింగల్ గా వచ్చిన వారికి ముగ్గురికి లేదా నలుగురికి కలిపి ఒక గది కేటాయించబడును
సంపూర్ణ యాత్ర ( చార్ ధామ్ మరియు హరిద్వార్ యాత్రలకు ) రూ.54, 000
కేవలం హరిద్వార్ యాత్రకు రూ.20,000
యమునోత్రి, కేదార్నాథ్ దర్శనానికి వెళ్లే భాగవతులు ( హెలికాఫ్టర్, డోలి, గుఱ్ఱము మీద ప్రయాణానికి ఖర్చులు) ఎవరికి వారే భరించవలసి ఉంటుంది.
అలాగే హరిద్వార్ లో " మానసాదేవి, చండీదేవి" దర్శనానికి వెళ్ళినప్పుడు రోప్ వే ఖర్చులు ఎవరికీ వారే భరించాలి.
జూన్ 17 న హరిద్వార్ నుండి బస్సులో బయలుదేరి న్యూ ఢిల్లీకి వెళ్లి అక్కడినుండి ట్రైన్ లో మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. జూన్ 18 వ తారీఖు మళ్ళీ మన స్వగృహాలకు చేరుకుంటాము.
త్వరలోనే రైలు కు సంబందించిన వివరములు తెలియజెయ్యబడును
ఆసక్తి గల భాగవతులు తమ అభిప్రాయము డిసెంబర్ 1 వ తారీఖు లోపల తెలియజేయవలసి ఉంటుంది.
గదికి ఇద్దరు చొప్పున వసతి సౌకర్యము హరిద్వార్ లో ఏర్పాటు చెయ్యబడుతుంది
సంపూర్ణ యాత్రకు వచ్చేవారికి, హరిద్వార్ యాత్రకు వచ్చేవారికి రైలు ప్రయాణము హరిద్వార్ వరకు మరియు ఢిల్లీ నుండి మన గమ్యస్థానము వరకు 3RD AC లో ఉంటుంది.
🕉⚛⚛🕉☸☸🕉🔯🔯🕉