అవధాన కళాపురస్కార సమర్పణ సంరంభము – 2022అవధాన కళాపురస్కార సమర్పణ సంరంభము - 2022favorite_border

Start Dateప్రారంభపు తేది
Friday, September 9, 2022
End Dateచివరి తేది
Friday, September 9, 2022
Timeసమయం
6:00 pm
Locationస్థానం
విశాఖపట్నంVisakhapatnam
Venueవేదిక
Kalabharati Auditorium , Maddilapalemకళాభారతి ఆడిటోరియం , మద్దిలపాలెం
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాసరస్వత్యైనమః

              తెలుగుభాషకు భూషణం, అక్షరమాలకు అలంకారం, కవుల హృద్యభావనకు అద్దం, శ్రీవాణీపదపద్మములకు నైవేద్యం పద్యం.

                      తెలుగు భాష యొక్క తియ్యదనాన్ని, కమ్మదనాన్ని, అమ్మతనాన్ని ప్రపంచం ప్రశంసించేలా దోహదం చేసిన ఎన్నో విశిష్టభాషాప్రక్రియలలో తలమానికం అవధానం. అవధానవిద్యకు ఆద్యులలో అగ్రేసరులు, ఆశుకవిత్వంలో అగ్రగణ్యులు కొప్పరపు సోదర కవులు. వారి సంస్మరణార్థం అవధానప్రక్రియ, పద్యవిద్య, తెలుగు సాహిత్యం పదికాలాల పాటు పరిఢవిల్లేందుకు, విరాజిల్లేందుకు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠమును స్థాపించారు ప్రముఖ పాత్రికేయులు, కొప్పరపు కవుల మనుమలు శ్రీ మా శర్మ గారు. ప్రతి సంవత్సరం తెలుగు సాహితీతేజోవైభవాన్ని వ్యాప్తి చేస్తున్న ఉద్దండ సాహితీద్రష్టలకు, స్రష్టలకు, వివిధ కళారంగ నిపుణులకు తమ వంతుగా గౌరవపురస్కార, సత్కారాలను అందజేయడం ధ్యేయంగా పెట్టుకొన్న ధన్యశీలి.

2022వ సంవత్సరానికి సంబంధించి కొప్పరపు కళాపీఠము వారు తమ సంస్థ ద్వారా త్రిభాషామహాసహస్రావధాని, సప్తఖండ అవధాన సార్వభౌమ, ఆంధ్రభాషాభూషణ, అవధాన సహస్రపద్మ, కవిరాజశేఖర పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సాహితీపురస్కారాన్ని అందజేయడం  మహద్భాగ్యంగా భావిస్తున్నారు. శ్రీయుతులు పద్మాకర్ గురుదేవులు తెలుగుతల్లికి చేస్తున్న సాహితీసేవ అనన్యసామాన్యం. వారి మనస్సంకల్పజనితమైన, సరస్వతీ సమన్వితమై ఎన్నో ప్రపంచరికార్డులను సొంతం చేసుకొన్న "సప్తఖండ అవధాన సాహితీఝరి" ఎందరికో సాహిత్యపు బంగారుబాటలు వేసి, తరువాతి తరాలకు స్ఫూర్తిగా నిలచింది. అటువంటి మహాసరస్వతీస్వరూపమైన మహనీయునికి ఈ గౌరవపురస్కారం, సత్కారం అందించే దివ్యశుభతరుణం మనందరికీ ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని తిలకించడం మహద్భాగ్యంగా భావించి పదిమందికీ తెలియజేయండి, సాహితీవెలుగులను మీ వంతుగా పంచండి.

బలం గురోః ప్రవర్ధతాం
expand_less