Sri Ganesha Chaturthi 2022 – Competitionsశ్రీ గణేశ చతుర్థి 2022 - పోటీలుfavorite_border





🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
జయశ్రీరామ🙏

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||

శ్లోకం : గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం వందే శ్రీ గణనాయకం||

శ్రీ గురుభ్యోనమః.పూజ్యగురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము

ప్రసంగపు, మరియు చిత్రలేఖనపు పోటీలు గణపతి నవరాత్రులలో “ఆదౌ పూజ్యౌ గణాధిపః” అని అష్టాదశ పురాణేతిహాసాలు అన్నీ చెబుతున్నాయి. సకల కార్యాలు నిర్విఘ్నముగా జరగాలంటే మొదటి పూజ గణపతికే చేయాలి.’భక్తి ప్రియో గణేశః’ అని శివపురాణం చెబుతున్నది. విఘ్నేశ్వరుడిని పూజించి, వ్రతకథా అక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ సంవత్సరమంతా విఘ్నాల నుంచి బయటపడతాము.

సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్ననాశనుడు, గణాధిపతుడు, ధూమ్రకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు ఐన ఆ ఓంకారస్వరూపుడైన గణేశుని లీలలు అనంతం. స్వామి దివ్య లీలలను,మహిమలను శ్రీ వ్యాస భగవానులు అందించిన దివ్య పురాణమే శ్రీ గణేశ పురాణం. లోకశ్రేయస్సుకై, బ్రహ్మహత్యా పాతకం వంటి సమస్త పాపములును హరించే శ్రీ గణేశ పురాణం ను గురుదేవులు మనకు అందించారు.

వినాయక చవితి సందర్భముగా గణపతి నవరాత్రులలో శ్రీ ప్రణవ పీఠ శిష్య బృందం, పూజ్య గురుదేవులు ప్రవచించిన శ్రీ గణేశ పురాణం నుండి ప్రసంగపు పోటీలు, చిత్రలేఖనపు పోటీలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని స్వామి లీలలు భక్తితో ప్రసంగించండి.

ప్రసంగపు పోటీలలో మీ పేరు నమోదుకు మరియు చిత్రలేఖనపు పోటీలలో మీ చిత్రాలు పంపుటకు సమయం ఆగష్టు 1 నుండి ఆగష్టు 21 వరకు మాత్రమే.
శ్రీ గణేశ పురాణం యూట్యూబ్ లింక్:
https://youtube.com/playlist?list=PLfgDt5ZsV1JKjWOZBJssbUGLbwRqswBO1

ఆగష్టు 27 వ తేదీ శ్రీ గణేశ పురాణం ప్రసంగపు పోటీలు నిర్వహిస్తారు.

చిత్రలేఖనపు పోటీలు సబ్మిషన్ కు ఆఖరు తేదీ ఆగష్టు 21st.

గణేశ చతుర్థి వేడుకల కార్యక్రమం సెప్టెంబర్ 3 వ తేదీ నిర్వహించబడుతుంది. పోటీల వివరములుకు మరియు పోటీల నియమ నిబంధనలకు కింద pdf ని వీక్షించగలరు.

ప్రసంగపు పోటీలలో నమోదు చేసుకోవటానికి మరియు చిత్రాలు పంపుటకు క్రింద ఇవ్వబడిన వెబ్సైటు లింకు ను సందర్శించగలరు.

1) Chitralekhanam (Art competition) - Click here 
చిత్రలేఖనపు పోటీలు సబ్మిషన్ కు ఆఖరు తేదీ ఆగష్టు 21st.
2) Prasamgapu Potilu (Speech competition) - Click here
 ఆగష్టు 27 వ తేదీ శ్రీ గణేశ పురాణం ప్రసంగపు పోటీలు నిర్వహిస్తారు.

ధన్యవాదములు🙏

బలంగురోఃప్రవర్థతాం
బలం విష్ణోఃప్రవర్థతాం
🙏🙏🙏

expand_less