శ్రీ ప్రణవపీఠం దివ్యక్షేత్రంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు దశమ వార్షికోత్సవములుశ్రీ ప్రణవపీఠం దివ్యక్షేత్రంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు దశమ వార్షికోత్సవములుfavorite_border

శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రే నమః

భూలోక మణిద్వీప  త్రిమాతృశక్తిధామం - శ్రీ ప్రణవపీఠం

త్రిభాషామహాసహస్రావధాని, ప్రణవపీఠాధిపతి, శతాధిక ఆలయ ప్రతిష్ఠాపనాచార్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే ఏలూరులోని శ్రీ ప్రణవపీఠం దివ్యక్షేత్రంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం మరియు దశమ వార్షికోత్సవములు - 2023 ఫిబ్రవరి 4, 5 తారీఖులలో

కార్యక్రమ వివరాలు

ఫిబ్రవరి 3వ తారీఖు

ఉ. 10 గంటల నుండి ధ్వజస్తంభం ప్రతిష్ఠకు అంకురార్పణము.

ఫిబ్రవరి 4వ తారీఖు

ఆదౌ పూజ్యో గణాధిపః అన్నట్లు ఉదయం విఘ్నేశ్వర పూజ మరియు మండపారాధనతో మొదలై ఉ. 9:36 నిమిషాలకు దివ్య శుభముహూర్తం లో వివిధ దేవీదేవతల సమక్షంలో పరమపవిత్రమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం.

తదుపరి పదవ వార్షికోత్సవం క్రతువులలో భాగముగా అమ్మవార్లకు విశేష పూజాకార్యక్రమలు, అభిషేకములు, దివ్యాలంకారములు జరుగుతాయి. సింహ వాహన ప్రతిష్ఠ, బలిపీఠం ఏర్పాటు చేస్తారు.

సా. 4 గంటలకు హోమాది కార్యక్రమములు.

ఫిబ్రవరి 5

జగన్మాత లలితాపరాభట్టరికకు సువర్ణ కవచ అలంకరణ మరియు అనేక విశేష క్రతువులు ఉంటాయి.

ప్రతిరోజూ సందర్భానుసారంగా సమయానుకూలంగా పూజ్య గురుదేవుల దివ్యప్రవచనాలు ఉంటాయి. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదముల వితరణ కార్యక్రమములు ఉంటాయి.

ఒక ఆలయమునకు సంబంధించిన ఏ ప్రతిష్ఠా కార్యక్రమాలలో అయినా తెలిసికానీ తెలియక కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసుకునే సేవ అశ్వమేథ యాగం చేసిన ఫలితం ఇస్తుంది అని అగ్నిపురాణం చెబుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరమూ లోకకల్యాణార్థం జరుగుతున్న ఈ ప్రతిష్ఠాపన మహోత్సములలో పాల్గొని తరిద్దాం, అమ్మవారి దివ్యాశీర్వచనానికి, గురుకటాక్షానికి పాత్రులమవుదాం.

ముఖ్య గమనిక

అన్ని కార్యక్రమాలు 4,5 తారీఖులలో మాత్రమే ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా వచ్చే వారు ఫిబ్రవరి 4 ఉదయం నుంచి పీఠం సందర్శించవచ్చును. 3 వ తారీఖు న కేవలం ఒక్క కార్యక్రమం మాత్రమే ఉంటుంది.

బలం గురోః ప్రవర్ధతాం
expand_less