ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బాలాత్రిపుర సుందరిదేవి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానం యందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ విశ్వనాధ సేవా ట్రస్ట్ సౌజన్యంతో బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ పూజ్య గురుదేవుల శిష్య బృందం ఆధ్వర్యంలో భక్తులకు 30,000 వేలు రుద్రాక్షలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఆలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడే స్వయంగా నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగానికి సోమసూత్రం ప్రత్యేకత. ఈ ఆలయానికి గురువుగారికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఆలయం పునర్నిర్మాణంలో గురువుగారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.