Kartikamasa Mahotsavamకార్తికమాస మహోత్సవములుfavorite_border

శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయేనమః
శ్రీ ఉమామహేశ్వరాభ్యాంనమః

పూజ్య గురుదేవులకు జయము జయము

   కార్తికమాస మహోత్సవములు
 
      కార్తికమాసం అన్ని మాసాలలో మహిమ కలిగిన మాసం. శ్రీ ప్రణవ పీఠంలో సమర్థ సద్గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్, శ్రీమతి రంగవేణీ దంపతుల చేతుల మీదుగా ది.5-11-2021 శుక్రవారం నుండి ది.4-12-2021 శనివారం వరకు కార్తికమాసపూజలు మహా వైభవంగా జరుగుతాయి. పరమపవిత్రమైన ఈ కార్తిక మాసంలో శ్రీ ప్రణవ పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రణవేశ్వరునికి, శ్రీ పద్మేశ్వరునికి, శ్రీ సత్యధర్మేశ్వరునికి కూడా ప్రత్యేక పూజాకార్యక్రమాలు పూజ్య గురుదేవుల ఆధ్వర్యవంలో జరుగును.

        ఇందులో భాగంగా ప్రతిరోజు శ్రీ పద్మేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం, అలాగే పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి. శ్రీ సత్యధర్మేశ్వరునికి ప్రతినిత్యం ప్రత్యేక అభిషేకాలు, శ్రీ ప్రణవేశ్వర స్వామివారికి ప్రతిరోజు అభిషేకాలు చెయ్యడం జరుగుతుంది.

         ఈ కార్యక్రమాలలో అశేషంగా భక్తులు పాల్గొని తమ గోత్రనామాలతో అభిషేకాలు చేయించుకోవచ్చు. ఎవరైతే ప్రత్యేకంగా అభిషేకాలు చేయించుకోదలచిన భక్తులు ఉన్నారో, వారు శ్రీ జితేంద్రగారిని, శ్రీ అశోక్ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.

             పై కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి మరియు శ్రీ గురుదంపతుల అనుగ్రహము పొందగలరు. ఆసక్తి గల భక్తులు ప్రత్యక్షంగా పూజలలో పాల్గొనవచ్చును. పీఠానికి వెళ్లలేని దూరప్రాంతాలలోని భాగవతులు పరోక్షంగా పాల్గొనవచ్చును.

      ప్రత్యేకపూజా కార్యక్రమములు, అన్నదానం, పండితులకు వస్త్రదానం, గురుదంపతులకు వస్త్రదానం వంటి కార్యక్రమాలలో పాల్గొనదలచిన భక్తులు అశోక్ గారిని, లేదా జితేంద్ర గారిని సంప్రదించిన మీదట రుసుమును క్రింద తెలియజేసిన బ్యాంకు అకౌంటునకు మనీ ట్రాన్స్ఫర్ చేసి తమ గోత్ర నామములు నమోదు చేసుకొనగలరు.

   ఇక సామూహిక పారాయణం లో పాల్గొనదలచినవారు ఈ క్రింది లంకె ద్వారా గూగుల్ ఫారం ను నింపి మీ గోత్రనామాలను పంపవచ్చు. 

https://forms.gle/RMAcG229yfkARNU4A

             నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు "శివభక్తులు 63 మంది నాయనార్ల జీవితచరిత్ర" మీద శ్రీ గురుదేవుల దివ్యప్రవచనం కూడా ఉంటుంది.

నవంబరు 17, 18, 19 తారీఖులలో (త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ) ఈ మూడురోజులలో విశేషమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలు మన శ్రీప్రణవపీఠంలో జరుగబోతున్నాయి.

         నవంబరు 17 వ తేదీనాడు శ్రీ సత్యధర్మేశ్వరునికి, శ్రీ పద్మేశ్వరునికి సర్వాభిషేకాలు జరుగుతాయి. సామాన్యంగా శ్రీ సత్యధర్మేశ్వరునికి నిర్వహించేది జలాభిషేకం మాత్రమే. కానీ పవిత్ర కార్తిక మాసంలో సర్వాభిషేకాలు అనగా పంచామృతాలైన క్షీరాభిషేకం, దధి అభిషేకం, మధు అభిషేకం, ఆజ్యాభిషేకం, శర్కరాభిషేకాలతో పాటుగా సర్వ ఫలములతో అభిషేకం, గంధాభిషేకం, హరిద్రాభిషేకం, కుంకుమాభిషేకం, భస్మాభిషేకం లాంటివన్నీ కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. ఇక పద్మేశ్వరునికి ఈ అభిషేకాలన్నిటితో పాటుగా అన్నాభిషేకం, చిత్రాన్నాభిషేకం (పులిహోర) వైభవోపేతంగా నిర్వహించి, అది భక్తికోటికి ప్రసాదంగా పంచడం జరుగుతుంది.

             నవంబరు 18 వ తేదీనాడు లక్ష బిల్వార్చన,కోటిదీపోత్సవ కార్యక్రమం. శ్రీ సత్యధర్మేశ్వరుడు, శ్రీ పద్మేశ్వరుడు నెలకొని ఉన్నటువంటి ఆ ప్రాంగణమంతా కూడా కోటి దీపాలను వెలిగించి దివ్యంగా, దేదీప్యమానంగా అలంకరించే కార్యక్రమం. 

నవంబరు 19 వ తేదీ కార్తికపూర్ణిమ నాడు జ్వాలాతోరణం అనే బృహత్తర ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది.

 ఈ మూడురోజులలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు సత్సంగ సభ్యులందరికీ, శ్రీ గురుభక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. అందరికీ లేదనకుండా అన్నప్రసాదం అందించబడుతుంది. కానీ ఎవరికి వారు వసతి చూసుకోవలసి ఉంటుంది. భోజన సదుపాయం మాత్రమే అందించబడుతుంది. వసతిని మీరే చూసుకోవలసి ఉంటుంది. 
సాయిబాబా మందిరంలో కనీసం నూతనంగా నిర్మించిన హల్ లో, అమ్మవారి గుళ్లో నిద్రపోయే అవకాశం ఉంటుంది. విడిగా అన్ని సౌకర్యాలతో కూడిన వసతి కావాలి అంటే మీరు స్వంతంగా ఏర్పాట్లు చేసుకోగలరని మా విన్నపము.
పీఠమునకు ఈ మూడు రోజులు కార్యక్రమమును వీక్షించడానికి విచ్చేసే భక్తులు గూగుల్ ఫారంను నింపి పంపితే భోజనం ఏర్పాట్లు చెయ్యడానికి మార్గం సుగమవుతుంది.

https://forms.gle/FtQL43NzC5uDbtxB7

పురుషార్థము పంపవలసిన బ్యాంకు వివరములు

Pothuri Ashok kumar
IFSC code: CITI0000004
Account number: 5359893817
Citibank BANGALORE
 
     Google pay 9642335664
     Phone pay 9642335664

 Name : Rupa Rani solasa

Paytm : 9962468356 (పైన తెలియజేసిన అకౌంట్ నెంబర్ నకు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కుదరనప్పుడు మాత్రమే PAY TM ఉపయోగించగలరు Name: Ashok Kumar Pothuri
              
గమనిక

గోత్రనామములు గూగుల్ ఫారం లో నింపి పంపలేని వారు క్రింద తెలియజేసిన వాట్సాప్ నెంబర్లకి మాత్రమే తెలియజేయగలరు.

పరమపవిత్రమైన శివకేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనండి, శ్రీ గురుకటాక్షంతో హరిహరుల కృపకు పాత్రులుకండి.

 ముఖ్య గమనిక
మూడు రోజుల విశేష కార్యక్రమాలలో నవంబరు 17, 18, 19 తారీఖులలో (త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ) ప్రత్యేకముగా పాల్గొనదలచిన భక్తులు శ్రీ అశోక్ గారిని లేదా శ్రీ జితేంద్రగారిని సంప్రదించి వివరములు తెలుసుకొనవచ్చును. అభిషేకప్రియో ఈశ్వరః అన్నట్లు ఈ పవిత్ర కార్తిక మాసంలో ప్రత్యేకముగా అభిషేకాలు చేయించుకొనడం అత్యంత పుణ్యప్రదం, సకల శుభప్రదం.

శ్రీ అశోక్ గారు 9962468356
శ్రీ జితేంద్ర 8688544564

       బలం గురోః ప్రవర్ధతాం
కార్తిక మాసము మహోత్సవములలో మీ పేర్లు నమోదు చేసుకొనుటకు
👇🏻👇🏻
https://forms.gle/duE2hARuaqts8ZAf9

మూడోవ నవాహంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకొనుటకు 
👇🏻👇🏻👇🏻
https://forms.gle/RMAcG229yfkARNU4A

కార్యక్రమమును వీక్షించడానికి విచ్చేసే భక్తులు గూగుల్ ఫారంను నింపి పంపితే భోజనం ఏర్పాట్లు చెయ్యడానికి మార్గం సుగమవుతుంది 
👇🏻👇🏻👇🏻
https://forms.gle/FtQL43NzC5uDbtxB7


expand_less