జయ శ్రీరామ శ్రీ గురుభ్యోనమః పూజ్య గురుదేవులకు జయము జయము. మాఘ పౌర్ణమి, శ్రీ ప్రణవ పీఠం వార్షికోత్సవం సందర్బంగా జరిగిన ప్రపంచవ్యాప్త చిత్రాలేఖన పోటీలలో చిత్తశుద్ధితో, గురుభక్తితో అపూర్వమైన చిత్రాలు పంపిన భక్తులకు, చిన్నారులకు , వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. 270 మందికి పైగా వారి చిత్రములను పంపి గురుభక్తిని చాటుకున్నారు. వార్షికోత్సవములలో భాగముగా గురుదేవుల అనుగ్రహభాషణం మరియు చిత్రాలేఖన పోటీల విజేతల ప్రకటన కార్యక్రమం ఈ ఆదివారం నాడు (ఫిబ్రవరి 20) సాయంత్రం 7గం. 30 ని. లకు యూట్యూబ్ లో ప్రారంభమవుతుంది. https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial విజేతల వివరాలు ఈ కార్యక్రమం అయ్యాక వెబ్సైట్ లో కూడా పొందుపరుస్తాము. https://srivaddipartipadmakar.org