ఆరవ సత్సంగం కార్యక్రమంఆరవ సత్సంగం కార్యక్రమంfavorite_border

గుడి-బడి (ఆరవ సత్సంగం)కార్యక్రమంలో  భాగముగా ప్రతినెల ఏదో ఒక ఆదివారం హైద్రాబాద్ లోని  శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం  పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దివ్య ఆశీస్సులతో ఒక ఆలయాన్ని ఎంపిక చేసుకొని,తగిన రీతిలో ఆలయం శుభ్రంచేసి, భజన, స్తోత్ర పారాయణము చేసుకోవడం అలవాటు. 
ఈ రోజు గుడి - బడి లో భాగంగా కుంట్లూరు, నాగోల్ లోని 1000 సం౹౹ల పురాతన చరిత్ర కల  శివాలయం,హైద్రాబాద్ లో పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కలసి 60 మందికి పైగా చేరుకొని ఆలయం శుభ్రం చేసుకునే భాగ్యం కలిగింది. శుభ్రం చేస్తున్నంత సేపు భగవన్నామ జరుగుతూనే ఉంది. శివునికి, హనుమంతునికి అభిషేకం జరిగింది. ఇలా అన్నీ ప్రాంతాలలో  గుడి-బడి  జరగాలని సకల్పం. దానికి తగిన కృషి చేద్దాం!
 
బలం గురోః ప్రవర్ధతాం!

ఇట్లు,
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందము
expand_less