Oct 15 2022అక్టోబర్ 15 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 15 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : షష్ఠి పూర్తిగా ఉంది
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : మృగశిర  రాత్రి 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం :  వరీయాన్ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : గరజి ఈ రోజు సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹13ని౹౹ నుండి 07గం౹౹46ని౹౹ వరకు
 వర్జ్యం : లేదు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹38ని౹౹ నుండి 03గం౹౹24ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹51ని౹౹


గురుబోధ

మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారికోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము 

 శ్లో౹౹ 
గోభూతిల హిరణ్యాజ్య
వాసోధాన్య గుడాస్తథా
రజతం లవణం చైవ
దానాని దశవై విదుః ౹౹ -గరుడపురాణం (ధర్మకాండము)

1. గోవులు 2. భూమి 3. తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6. వస్త్రం 7. ధాన్యం 8. బెల్లం 9. వెండి 10. ఉప్పు


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less