Sep 29 2022సెప్టెంబర్ 29 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబర్ 29 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం శుక్లపక్షము 

తిథి : చతుర్థి  రాత్రి 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : బృహస్పతివారం  (గురువారం)
నక్షత్రం : స్వాతి  ఈ రోజు ఉదయం 07గం౹౹14ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం :  విష్కoభ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹39ని౹౹ నుండి 02గం౹౹12ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹41ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం   09గం౹౹57ని౹౹ నుండి 11గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹



గురుబోధ

అమ్మవారి నివాసస్థానం అయిన మణిద్వీప వర్ణన (శ్రీ మద్దేవీభాగవతములోని 283 శ్లోకాలు) పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగుతాయి. సకల శుభాలు కలుగుతాయి.  అంత్యకాలంలో మణిద్వీపం లో ఉండే భాగ్యం కలుగుతుంది.


expand_less